Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ జాబితాలో ఫిదా సాయిపల్లవి..

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (15:26 IST)
''ఫిదా''తో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవి ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాలో నటిస్తోంది. నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా జానపదాలు పాడే మహిళగా కనిపించనుందని సమాచారం. 
 
అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తప్ప.. సాయి పల్లవి చేతిలో తమిళ సినిమాలు కూడా ఏమీ లేవని సమాచారం. ఆ మధ్య తమిళంలో సూర్య సరసన నటించిన 'ఎన్‌జీకే' చిత్రంలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింది. 
 
అంతకుముందు ధనుష్‌తో జతకట్టి ఆడి పాడిన 'మారి 2' సినిమా మంచిగానే ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాలో 'రౌడీ బేబి' పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు చేరింది. 
 
సాయిపల్లవి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా ముప్పై సంవత్సరాలలోపు తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను పొందిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా వినోదరంగంకు సంబందించి 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు సంపాదించుకుంది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నటి ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments