Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చెప్పిన మాట వినరు : అమితాబ్

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (08:43 IST)
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అదీ కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి. చిరంజీవి చెప్పిన మాట వినరంటూ చెప్పారు. పైగా, తాను చిరంజీవికి ఎన్నో సలహాలు ఇచ్చినప్పటికీ ఆయన ఏ కొన్నింటినో  పాటిస్తారే కానీ, అన్నీ పాటించరన్నారు. 
 
చిరంజీవి - అమితాబ్ కలిసి నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం హిందీ ప్రమోషన్ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులోభాగంగా, ముంబైలో అమితాబ్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, అమితాబ్‌ను బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. 
 
ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పానని, కానీ ఆయన తన మాట వినలేదన్నారు. తాను చిరంజీవికి ఎన్నో సలహాలు ఇచ్చినా ఆయన ఏ కొన్నింటినో పాటిస్తారు తప్ప అన్నీ పాటించరని తెలిపారు.
 
చాలాకాలంగా చిరుతో స్నేహం ఉందని, ఊటీలో 'హమ్' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే చిరంజీవి కూడా సెట్స్ మీద ఉన్నారని వెల్లడించారు. అప్పటికే చిరంజీవి గురించి చాలా విన్నానని, షూటింగ్ దగ్గర్లోనే జరుగుతుండడంతో వెళ్లి కలిశానని తెలిపారు. అక్కడ్నించి తమ స్నేహం మొదలైందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments