Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-ఎంట్రీతో ఫుల్ బిజీ అయిన రాముల‌మ్మ..‌

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (22:25 IST)
రాముల‌మ్మ.. అదేనండి సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూర‌మైంది. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి కీలకపాత్ర పోషిస్తుంది. విజయశాంతిపై దాదాపు అన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఆమె షూటింగ్‌లో ఉండగానే కొంతమంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్ర‌దించి త‌మ సినిమాలో న‌టించాల‌ని అడిగార‌ట‌. 
 
అంతేకాదండోయ్... మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాలో సైతం నటించాలని కోరారట. చిరు మూవీ కావ‌డంతో సెకండ్ థాట్ లేకుండా వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. 
 
అలాగే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 లో న‌టించాల‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అడుగ‌గా... విజ‌య‌శాంతి అనిల్ రావిపూడి వ‌ర్క్ న‌చ్చి చేస్తాన‌ని మాట ఇచ్చింద‌ట‌. విజ‌య‌శాంతి.. చిరు - కొర‌టాల‌ మూవీ, ఎఫ్ 3 ఈ సినిమాల్లో న‌టిస్తే.. ఈ సినిమాల‌కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments