Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందీ మార్కెట్‌పై కన్నేసిన మహేష్... 'కేజీఎఫ్' డైరెక్టర్‌తో కమిట్!

Advertiesment
హిందీ మార్కెట్‌పై కన్నేసిన మహేష్... 'కేజీఎఫ్' డైరెక్టర్‌తో కమిట్!
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:02 IST)
దర్శకుడు ప్రశాంత్ నీల్‌ 'కేజీఎఫ్' చిత్రంతో సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అదేసమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హిందీ మార్కెట్‌పై కన్నేశాడు. దీంతో 'కేజీఎఫ్' డైరెక్టరు ప్రశాంత్‌తో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో "స‌రిలేరు నీకెవ్వ‌రు" అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ సాగుతోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం తర్వాత మ‌హేష్ ఏ ప్రాజెక్ట్ ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. 
 
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో మ‌హేష్ త‌ర్వాతి ప్రాజెక్ట్ ఉంటుంద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, మరికొంద‌రు 'మ‌హ‌ర్షి'తో మ‌హేష్‌కి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిప‌ల్లితో ఉంటుంద‌ని అంటున్నారు. వంశీ ఇప్ప‌టికే మ‌హేష్‌కి స్టోరీ లైన్ వినిపించాడని అది న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా మొద‌లు పెట్టాడ‌ని విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతుంది. 
 
ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడా లేదంటే వంశీతోనే మ‌రో సినిమా చేస్తాడా అనేది స‌స్పెన్స్‌గా మారింది. రానున్న రోజుల‌లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. 'మ‌హేష్' తాజా చిత్రంలో ఆయ‌న ఆర్మీ మేనేజ‌ర్‌గా క‌నిపించి అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... నయనతారకు అంత రేటా? (video)