Webdunia - Bharat's app for daily news and videos

Install App

వస్తున్నారు.. సంక్రాంతి అల్లుళ్లు : నవ్వులు పూయిస్తున్న"ఎఫ్2" ట్రైలర్

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (13:15 IST)
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్న చిత్రం "ఎఫ్2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో వెంకటేష్ సరస
న తమన్నా నటిస్తుంటే, వరుణ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్‌లు అత్యంత కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ఈ చిత్రంలో వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం వెంకీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గురువారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుండ‌గా, ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే 34 లక్షల మంది వీక్షించారు. 
 
తాజాగా ఎఫ్-2 టీజ‌ర్‌పై మ‌హేష్ ప్ర‌శంస‌లు కురిపించాడు. మూవీ ఫ‌న్‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్థమ‌వుతుంది. వెంకీ సార్ టెరిఫిక్. సినిమా టీం అంద‌రికి బెస్ట్ విషెస్‌. హ్యాపీ బర్త్ డే సార్. మరో అద్భుతమైన సినిమాలో నటించారు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 
 
దీనికి స్పందించిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి .. మ‌హేష్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీ నుండి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు అని అన్నారు. టీజ‌ర్ మిమ్మ‌ల్ని ఆనంద‌ప‌ర‌చినందుకు సంతోషంగా ఉంద‌ని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశారు. కాగా, మ‌హేష్‌, వెంకీలు కలిసి "సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు" అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments