Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (12:22 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది రోజున జరుగనుంది. సినిమా షూటింగును జాన్ నుంచి ప్రారంభించాలన్న మేకర్స్ భావిస్తున్నారు. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
కాగా, చిరు - అనిల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పూర్తి హాస్య భరితంగా తెరకెక్కనుంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుంది. 2026 సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లు, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సివుంది. 
 
కాగా, గత సంక్రాంతికి వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంక్రాంతి మెగా బ్లాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments