Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ నాగేశ్వరరావు నుండి ఏక్ దమ్ ఏక్ దమ్ పాట 5 భాషల్లో విడుదల

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (17:11 IST)
Ravi Teja, Nupur
రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ భారతదేశంలోని అతిపెద్ద దొంగ ఇన్ ఫేమస్ యాక్ట్స్ గురించి మాత్రమే కాదు అతని జీవితంలోని ఇతర కోణాలను ప్రజెంట్ చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లను గ్రాండ్ గా ప్రారంభించారు.
 
‘’ఏక్ దమ్ ఏక్ దమ్' పాట  పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవనుంది. ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్ పల్స్‌ తెలిసిన కంపోజర్స్ లో జివి ప్రకాష్ కుమార్ ఒకరు. ఏక్ దమ్ ఏక్ దమ్ పాటలో డ్యాన్స్ రిథమ్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి. జివి తన ఇన్‌స్ట్రుమెంటేషన్, కంపోజిషన్ తో పాటకు రెట్రో అనుభూతిని తెచ్చారు. భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా అలపించారు.
 
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే ఎలక్ట్రిఫైయింగ్, ట్రెండీ హుక్ స్టెప్‌ను క్రియేట్ చేశారు. రవితేజ యంగ్ గా కనిపించారు. రవితేజ డ్యాన్స్ యూత్, మాస్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. కాస్ట్యూమ్స్, సెట్లు కూడా రెట్రో అనుభూతిని పెంచుతాయి. ఈ పాటకు ఇన్స్టంట్ రెస్పాన్స్ వస్తోంది. రాబోయే రోజుల్లో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
 
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
 
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments