దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆయన నటించిన మొదటి సినిమా `మహానటి` ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే బేనర్ స్వప్న సినిమా పతాకంపై దుల్కర్ సల్మాన్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.
బుధవారంనాడు దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నారు. ఇది తన బర్త్‌డేకి పర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్కర్ తెలిపారు.
- పీరియడ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సారథ్యంలో కాశ్మీర్‌లోని పలు అందమైన లోకేషన్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
- హార్ట్ టచింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో ప్రసిద్ది చెందిన హను రాఘవపూడి మరో ఆసక్తికర అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
- ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్లో దుల్కర్ సల్మాన్ చేతిలో ఒక లెటర్ పట్టుకుని నవ్వుతూ సైకిల్‌మీద కూర్చొని ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరున్నారు.