Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రీ, కుమార్తె సెంటిమెంట్‌తో ‘అల్లుడు బంగారం’ ప్రారంభం

Advertiesment
Alludu Bangaram
, బుధవారం, 28 జులై 2021 (17:11 IST)
Suman clap
అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న‌ ‘అల్లుడు బంగారం’ చిత్రం బుధ‌వారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం సుమన్ మాట్లాడుతూ, కుటుంబ‌క‌థా చిత్ర‌మిది. కరోనాకు ముందే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న నేను, పృథ్వీ కూడా ఇందులో ఫ్రెండ్స్ గా నటిస్తున్నాము. ఒక విలేజ్‌లో ఉంటున్న వారి మెంటాలిటీ, వాతావ‌ర‌ణం ఎలా ఉంటుంది. ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో యూత్ & ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమే ఇది. ఈ దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు` అన్నారు.

నటుడు పృథ్వీ మాట్లాడుతూ. దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.

దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ, ఆర్‌.నారాయణమూర్తి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేశాను. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నాను. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది’ అన్నారు.

నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ, తండ్రీ, కుమార్తె సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`తిమ్మ‌రుసు`రాబోయే సినిమాల‌కు ఆక్సిజ‌న్‌లా మారాలిః నాని