Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే లిరికల్ సాంగ్ విడుదల

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:48 IST)
Sri Vishnu
హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్‌టైనర్‌ మూవీ ‘రాజ రాజ చోర’. ఇప్పటికే విడుదలైన టీజర్  ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్, హిట్‌ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్‌ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది.
 
ఈ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు..చొరబడి చెడిపోతే చతికిల పడతారు..రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్‌ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్ త‌దిత‌రులు న‌టించారు.
 
సాంకేతిక విభాగం
రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి, ప్రొడ్యూసర్స్‌: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల, మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌, సినిమాటోగ్రఫీ: వేదరామన్‌, ఎడిటింగ్‌: విప్లవ్‌, ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments