Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు రేవ్‌ పార్టీలో వెలుగులోకి వచ్చిన కొత్త విషయం... ఏంటది?

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (14:43 IST)
బెంగుళూరు రేవ్ పార్టీలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో తొలుత పాల్గొనలేదంటూ బుకాయించిన టాలీవుడ్ సినీ నటి హేమ... ఈ పార్టీలో పాల్గొన్నట్టు తేలింది. ఈ మేరకు బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ దేవానంద్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది.
 
‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు ​​జారీ చేయనుంది. రేవ్‌పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లోనే హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 
 
తాను రేవ్‌పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ ఓ వీడియో విడుదల చేశారు. అయితే రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని అప్పుడే స్పష్టం అయింది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ, చికెన్ డమ్ బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా ఉండేలా మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్‌గా రావడంతో ఆమె బండారం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చాలాకాలం తర్వాత పవన్ కల్యాణ్‌ను కలవనున్న మాజీ హీరోయిన్?

నెరవేరిన కోరిక .. తిరుమలకు అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభం!

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. మెగా డీఎస్పీపై తొలి సంతకం..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల అధికారమే గొప్పది : మాజీ మంత్రి కేటీఆర్

లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్టు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments