Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి హేమ, ఆషీరాయ్ Rave Partyలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ

Advertiesment
Hema-Aashi Rai

ఐవీఆర్

, గురువారం, 23 మే 2024 (14:03 IST)
రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో వున్న తెలుగు తారలు, వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో 98 మంది శాంపిల్స్ సిసీబి సేకరించి పరీక్షించగా నటి హేమ, ఆషీరాయ్, వాసులకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ పుచ్చుకున్నట్లు నిర్థారణ అయ్యింది. ఫలితాలు పాజిటివ్ రావడంతో నటి హేమతో పాటు మిగిలినవారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసారు.
 
నేను ఒక ఆడపిల్లను, అమయాకరాలుని: ఆషీరాయ్
నటి ఆషీరాయ్ బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లింది. పార్టీలో జరిగిన పరిణామాలపై స్పందించింది. ఓ వీడియో కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. "నేను బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడ పిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను" అని వివరణ ఇచ్చింది. 
 
వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకునే వెళ్లానని ఆషీరాయ్ అన్నారు. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామని బెంగళూరు సీపీ తెలిపారు. ఇప్పటివరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్‌ తీసుకున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పట్టుబడినవారిలో చాలామంది హైదరాబాద్ టెకీలు ఉన్నారని చెప్పారు.
 
కాగా, ఆషీ రాయ్.. వైతరణి రాణా, లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక, కెఎస్ 100 వంటి చిత్రాల్లో నటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించేవారో వివరించిన విజయ్ దేవరకొండ