Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

johny

ఐవీఆర్

, సోమవారం, 20 మే 2024 (21:06 IST)
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను దొరికాననీ, ఇంకా సంథింగ్ సంథింగ్ అంటూ ఏవేవో రాసేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఆక్షేపించారు. తనకు తన పిల్లలతో శెలవుల్లో కలిసి కనీసం చాక్లెట్ పార్టీ చేసుకునేందుకు కూడా తీరిక దొరకడం లేదనీ, అటువంటిది రేవ్ పార్టీ నేను ఎలా వెళ్తానని అన్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జానీ మాస్టర్ ఇలా చెప్పుకొచ్చారు. ''హైదారాబాద్‌లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు. 
 
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు మా అసోసియేషన్లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో, ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ కూడా వాళ్ళకోసం కాదు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళకోసం. అసలు పార్టీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు. అందరం కలిసి చేసుకుందాం..జై జనసేన"
 
బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన కారులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్టిక్కర్ దొరికిందా?
బెంగళూరులో ప్రముఖ వ్యాపారస్తుడు ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు దొరికిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాళ్లెవరన్నది మాత్రం బయటకు రావడంలేదు. ఇద్దరుముగ్గురు పేర్లు బయటకు రాగా... అలాంటి రేవ్ పార్టీల్లో తాము వెళ్లమంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదే రేవ్ పార్టీకి వచ్చిన ఓ కారులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫోటో వున్న స్టిక్కర్ వున్నట్లు టీవీ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ కారులో వచ్చినవారు ఎవరన్నది తెలియాల్సి వుంది.
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతాల్లోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని కర్నాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే యువకుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ రేవ్ పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. ఫాంహౌస్‌ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి చెందిన స్టిక్కర్‌ను గుర్తించినట్టు కన్నడ మీడియా పేర్కొంది. అయితే, ఆ కారు తనది కాదని వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. 
 
ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో సీబీఐ పోలీసుల బృందం అక్కడ ఆకస్మిక సోదాలు చేసింది. దాదాపు మూడు గంటల పాటు ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌస్‌‍ ఆవరణలో పార్క్ చేసిన మెర్సిడెజ్ బెంజ్, జాగ్వార్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా 25 మంది యువతులు ఉన్నట్టు సమాచారం. వీరిలో సినీ నటి హేమ, బుల్లితెర యాంకర్ శ్యామల వంటి వారు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, బెంగుళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై సినీ నటి హేమ స్పందించారు. తాను హైదరాబాద్ నగరంలోని ఓ ఫాంహౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదని, అక్కడ తాను పోలీసులకు పట్టుబడినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె వివరణ ఇచ్చారు. 
 
ఇదిలావుంటే, బెంగుళూరు రేవ్ పార్టీ‌లో తెలుగు యాంకర్ శ్యామల పట్టుబడ్డారని, మంత్రి కాకాణి కారులో బెంగుళూరు వెళ్ళినట్టు సమాచారం. మరోవైపు, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో మంత్రి కాకాణి కుటుంబ సభ్యులు? బట్టలు విప్పుకుని డ్యాన్సులు వేసే రేవ్ పార్టీలో మంత్రి కాకాణి పాస్ ఉన్న కారు ఎందుకు ఉంది? బెంగళూరులో  గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌పై పోలీసులు ఆకస్మిక దాడుల్లో బయటపడ్డ బాగోతం. భారీగా డ్రగ్స్ కూడా లభ్యం. రేవ్ పార్టీలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట పాస్ ఉన్న కారును గుర్తించిన బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా