Krish Siddipalli, Ritika Chakraborty
సినిమా అంటే ప్యాషన్‌తో పరిశ్రమలోకిి వచ్చాడు హీరో క్రిష్ సిద్దిపల్లి. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్షణం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఎగ్జ్ గ్యూటీవ్ ప్రొడ్యూసర్ నుంచి హీరోగా ఆయన జర్నీ ఎంతో స్పూర్తి దాయకం. గూడాచారీ, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు ఎగ్జ్ గ్యూటీవ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. 2021లో నేను లేని నా ప్రేమ కథ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఒక్కో సినిమా చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఆడియన్స్ ను సంపాదించుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
ప్రస్తుతం క్రిష్ సిద్దిపల్లి హీరోగా తెరకెక్కుతున్న రేవ్ పార్టీ సెన్సార్ కు రెడీ అయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 3 హీరో క్రిష్ సిద్దిపల్లి పుట్టన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
యువతకు నచ్చేలా వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న తాజా చిత్రం రేవ్ పార్టీ. ఇనవర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు సూరం మూవీస్ బ్యానర్ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేవ్ పార్టీ" సెన్సార్ కు రెడీ అయింది. క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, తదితరుల ముఖ్య తారగణంతో మైసూర్, ఉడిపి, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో 35 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది.
రేవ్ పార్టీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో విడుల చేస్తున్నారు. క్రిష్ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య గౌడ రేవ్ పార్టీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సాధారణంగా ఉడిపి, గోవా, బెంగుళూరు లాంటి ప్రాంతాలలో ఎక్కువగా రేవ్ పార్టీలు జరుగుతుంటాయని, అందుకే ఆ ప్రాంతాల్లోనే ఒరిజినల్ లొకేషన్స్ లో మూవీని చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు.
అలాగే రేవ్ పార్టీలు ఎలా జరుగుతాయి. ఆ రేవ్ పార్టీ ల వెనుక ఎవరెవరు ఉంటారు. వాటి వల్ల యువతకు జరిగే నష్టం ఏంటన్నది ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీ కంటెంట్ కచ్చితంగా యువతకు, సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రేవ్ పార్టీ సినిమాకు త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న హీరో క్రిష్ సిద్దిపల్లికి చిత్ర యూనిట్ బెస్ట్ విషెస్ తెలియజేశారు.
నటీనటులు: క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, తదితరులు, నిర్మాతలు :రాజు బొనగాని, జయరామ్ దేవసముద్ర, డైరెక్టర్ : రాజు బొనగాని