Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈగల్ మ్యూజిక్ లో రవితేజ విలువైన సూచనలు చేశారు- మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది :డేవ్ జాంద్

Music director Dave Zand

డీవీ

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (08:01 IST)
Music director Dave Zand
ఈగల్ లో చాలా కొత్త తరహా సంగీతం చేశాం. ఈగల్ ఆన్ హిస్ వే అనేది కంప్లీట్ ఇంగ్లీష్ ట్రాక్. రవితేజ గారికి ప్రోపర్ ఇంగ్లీష్ ట్రాక్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.  ఈగల్ సినిమాలో స్క్రీన్ ప్లే, యాక్షన్, దర్శకుడు తీసిన విధానం చాలా యూనిక్ గా వుంటాయి. ఇందులో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి. ఆడు మచ్చా పాట మాస్ ని మెస్మరైజ్ చేస్తుంది.  గల్లంతు పాట మనసుని హత్తుకునే మెలోడీ. రాబోతున్న నాలుగో ట్రాక్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈగల్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. రవితేజ గారి యాక్షన్ ఎపిసోడ్స్, ఎక్స్ ట్రార్డినరీ ఫైట్స్, లవ్ ట్రాక్, పోలెండ్ లో షూట్ చేసిన ఇంటర్ నేషనల్ ఎపిసోడ్స్ వున్నాయి. వీటన్నటిలో మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సౌండ్ డిజైన్ చాలా కేర్ ఫుల్ గా చేశాం అని మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ అన్నారు. 
 
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ సంగీత దర్శకుడు డేవ్ జాంద్ చిత్ర విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
 
-నేను సెల్ఫ్ ఫ్రీ లాన్స్ మ్యుజిషియన్ ని. హీరో శ్రీ విష్ణు, నేను గీతం కాలేజ్ లో క్లాస్ మేట్స్. శ్రీ విష్ణు గారిని కలవడం, అప్పుడే కార్తిక్ గారికి నా ట్యూన్స్ వినిపించేవాడిని. ఆయన రాసుకున్న ప్రతి స్క్రిప్ట్ కి  ముందు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేయడం, అలా కార్తిక్ గారితో జర్నీ కొనసాగింది. రవితేజ గారితో ఈగల్ సినిమా ఓకే అయిన తర్వాత ''ఆయన్ని ఒప్పించి నిన్ను ప్రాజెక్ట్ లోకి తీసుకురాలేను' అని కార్తిక్ ముందే చాలా స్పష్టంగా చెప్పారు. రవితేజ గారి సినిమాకి సహజంగానే వండర్ ఫుల్ బిగ్ కంపోజర్స్ పని చేస్తారు. అయితే నా ప్రయత్నంగా మూడు ట్రాక్స్ కంపోజ్ చేసి కార్తిక్ కి ఇచ్చాను. ఈ మూడు ట్రాక్స్ రవితేజ గారు విన్నారు. ఆయనకి చాలా నచ్చాయి. అలా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు.  
 
- పదో తరగతి నుంచి నా మ్యూజిక్ జర్నీ మొదలైయింది. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ చేసేవాడిని. సోని ఎంటర్ నేషనల్ గేమ్స్ కి మ్యూజిక్ చేసేవాడిని. మొదటి నుంచి ఫిల్మి స్ట్రక్చర్ పై ఒక అవగాహన వుంది. స్క్రీన్ ప్లే లోని షిఫ్ట్స్ ని అర్ధం చేసుకునేవాడిని. అలాగే కార్తిక్ కూడా చాలా సపోర్టివ్. చాలా విషయాలు చెప్పేవాడు. అలాగే ఏఆర్ రెహమన్, అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇలా అందరి సంగీతంపై లోతైన పరిశీలన వుంది. ఇవన్నీ కూడా సినిమా సంగీతంపై పూర్తి అవగాహన వచ్చేలా చేశాయి.  ఈగల్ లో నేపధ్యం సంగీతం విని అద్భుతంగా చేశానని రవితేజ గారు ప్రశంసించారు. అది చాలా తృప్తిని ఇచ్చింది. రవితేజ గారితో మాట్లాడినపుడు చాలా స్ఫూర్తిదాయకంగా వుంటుంది.  
 
-రవితేజ గారిని తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యాను. పక్కన కూర్చోమని పూతరేకులు తెప్పించారు. దాదాపు గంటపాటు మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మోటివేట్ చేశారు. రవితేజ గారు వండర్ ఫుల్ పర్సన్. ఆయన అభిమానులకు, కార్తిక్ రాసుకున్న కథకు నా మ్యూజిక్ తో న్యాయం చేకూరేలా చూడాలనే భాద్యతతో పని చేశాను. రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.
 
- కొత్తగా చేయబోతున్న సినిమాలు..  కార్తిక్ గారితోనే మరో సినిమా చేస్తున్నా. త్రినాథ్ గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతినిచ్చే గేమ్ ఆన్ రివ్యూ