Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హేమక్కా ఇలా అయిపోయావేంటి... రేవ్ పార్టీ కేసు నుంచి త్వరగా బయటపడాలి : కరాటే కళ్యాణి

karate kalyani

ఠాగూర్

, బుధవారం, 22 మే 2024 (13:27 IST)
హేమక్కా.. ఇలా అయిపోయావేంటి.. నిన్ను చూస్తే జాలేస్తుంది. రేవ్ పార్టీ కేసు నుంచి నువ్వు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా అంటూ కరాటే కళ్యాణి అన్నారు. పైగా, రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ చాకిరేవు పెట్టాలనీ ఆమె కోరారు. తప్పుచేస్తే ఆడ, మగ అనే తేడా లేకుండా కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. పైగా, ఎంజాయ్ చేయాలనుకునేవారు తమ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటూ ఆమె హితవు పలికారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ఆమె స్పందించారు. 
 
హేమ ఓ పార్టీలో పాల్గొందని తేలితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. తప్పు చేసిన వారు ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఒకటేనని, వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, దానికి ఫలితం అనుభవించాల్సిందేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయిన కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. 
 
పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిపై కరాటే కళ్యాణి మండిపడ్డారు. ఈ పార్టీల వలల్ ఒక్కరు తప్పుచేసినా మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, మన సంస్కృతి నాశనం అవుతుందని కళ్యాణి వాపోయారు. రూ.50 లక్షలు పెట్టి రేవ్ పార్టీలు చేసుకోవడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ఎంజాయ్ చేయాలనుకుంటే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి రావాలని సూచించారు. హేమను ఎవరూ ఇరికించలేదని, నోటి దురుసుతనమే ఆమెకు శత్రువని కళ్యాణి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేదిక, మంచు లక్ష్మి లతో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి చేసున్న హాట్ స్టార్