Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించేవారో వివరించిన విజయ్ దేవరకొండ

devarakonda brothers

ఠాగూర్

, గురువారం, 23 మే 2024 (12:10 IST)
విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా విజయ్‌ మూడు సినిమాలు ప్రకటించగా.. ఆనంద్‌ 'గం.. గం.. గణేశా'తో ప్రేక్షకుల ముందుకురానన్నారు. మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ ప్రెస్మీట్‌లో విజయ్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించే వారో చెప్పి నవ్వులు పూయించారు.
 
'మా ఇద్దరి వాయిస్‌ ఒకేలా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మకు కూడా మాలో ఎవరు పిలిచారో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్‌ను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆటపట్టించేవాళ్లం. నా మిత్రులు ఫోన్‌ చేస్తే ఆనంద్‌ మాట్లాడేవాడు. వాళ్లు నేను మాట్లాడుతున్నా అనుకొనే వారు. కాలేజ్‌ డేస్‌లో ఇలా ఎక్కువగా ప్రాంక్‌ చేసేవాళ్లం. నా సినిమాలో ఆనంద్‌తో డబ్బింగ్‌ చెప్పించాలని ప్రయత్నించాను' అన్నారు. 
 
'గం.. గం.. గణేశా' గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని అభినందించారు. ప్రీ రిలీజ్‌కు రావాలనుందని.. కానీ, వైజాగ్‌లో షూటింగ్‌ కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. 'గం.. గం.. గణేశా' కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. 'బేబి' లాంటి సూపర్ హిట్‌ తర్వాత ఆనంద్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇది ఓ విగ్రహం చోరీ చుట్టూ తిరిగే కథ. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ కథానాయికగా కనిపించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్