Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

Advertiesment
Anand Devarakonda   Pragathi Srivastava  Vijayendra Prasad

డీవీ

, సోమవారం, 20 మే 2024 (19:24 IST)
Anand Devarakonda Pragathi Srivastava Vijayendra Prasad
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

webdunia
Gam gam ganesh trailer event
ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ఆనంద్ ఫ్యాన్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లో ఉన్న హుషారు కనిపిస్తోంది. బేబి సినిమాను రీసెంట్ గా చూశాను. ఆనంద్ నటన, సాయి రాజేశ్ రూపకల్పన ఎంతో ఆకట్టుకుంది. వారికి నా ఆశీస్సులు అందజేస్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ ఉదయ్ నా దగ్గర పనిచేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. గం గం గణేశ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. తెలంగాణలో 72 పర్సెంట్, ఏపీలో 81 పర్సెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సినిమాకు మాత్రం 100 పర్సెంట్ ప్రేక్షకులు ఓటేస్తారని ఆశిస్తున్నా.  వినాయకుడిని పూజించకుండా వెళ్తే విఘ్నాలు ఎదురవుతాయి. అబ్బాయిలు ఈ సినిమా చూడకుండా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే మీ చెంపలు పగులుతాయి. అన్నారు.
 
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ, ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మూవీలో చాలా షేడ్స్ ఉంటాయి. స్పైసీ, స్వీట్, థ్రిల్, యాక్షన్ అన్ని అంశాలతో గం గం గణేశా ఆకట్టుకుంటుంది. ఆనంద్ క్యారెక్టర్ మీకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ నెల 31న గం గం గణేశా థియేటర్స్ లో చూడండి. అన్నారు.
 
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - బేబి లాంటి మెమొరబుల్ మూవీని నాకు అందించిన దర్శకుడు సాయి రాజేశ్ అన్నకు థ్యాంక్స్. మా అన్నయ్య విజయ్ లోని యాక్టింగ్ టాలెంట్ ను మొదట గుర్తించింది విజయేంద్రప్రసాద్ గారు. అన్న స్టేజ్ ప్లేస్ చేస్తున్నప్పుడు నీలో టాలెంట్ ఉంది. నా సినిమాల్లో తీసుకుంటా అనేవారు. ఆయన ఇవాళ మా ఈవెంట్ కు వచ్చి బ్లెస్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటుంది. అతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సినిమా డైరెక్టర్స్ మీడియం. వారికే మొదట ప్రాధాన్యత దక్కాలి. నిన్న డైరెక్టర్స్ డే ఘనంగా జరుపుకున్నాం. డైరెక్టర్స్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా అభిమానులు మనమంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలో ఏ మంచి జరిగినా, ఎవరు ఏది అఛీవ్ చేసినా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇవాళ చిత్ర పరిశ్రమలో కాంపిటీషన్స్ నుంచి కంపారిజన్స్ వైపు వెళ్తున్నాం.

ఎవరైనా పెద్దవాళ్లు ఏదైనా సాధిస్తే  కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి. అలా కాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్లు సాధించే విజయాలు సెలబ్రేట్ చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా రియలిస్టిక్, న్యాచురల్ మూవీస్ చేశాను. గం గం గణేశాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో వస్తున్నా. ఇది టిపికల్ జానర్ మూవీ. క్రైమ్ కామెడీ కథతో ఆకట్టుకుంటుంది. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, స్వామి రారా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. బేబి సినిమాతో దీన్ని పోల్చుకుని చూడకండి. గం గం గణేశా వేరే జానర్ మూవీ. మా డైరెక్టర్ ఉదయ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాడు. సాటివారికి సపోర్ట్ చేస్తాడు. ఆయనకు మరో రెండు మూడు సినిమాలు వెంటనే అవకాశాలు దక్కి బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. మా ప్రొడ్యూసర్స్ కు గం గం గణేశా డబ్బులు తీసుకురావాలి. థియేటర్స్ లో ఈ నెల 31న గం గం గణేశా చూసి బ్లెస్ చేయండి. అన్నారు.
 
నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ - గం గం గణేశాతో ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. మాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా టీజర్ మీకు ఎలా నచ్చిందో ట్రైలర్ కూడా అలాగే ఇంప్రెస్ చేస్తుంది. గం గం గణేశా సాంగ్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. యాక్షన్ పార్ట్ లో ఆనంద్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ నెల 31న గం గం గణేశా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ - సినిమాలను క్లాస్ మాస్ అని విభజిస్తాం. కానీ మా మూవీ క్లాస్ మాస్ కలిపి ఉంటుంది. గణేశ్ చతుర్దిని అన్ని వర్గాల ప్రజలు ఎంత ఎనర్జిటిక్ గా జరుపుకుంటారో అంతే ఎనర్జి మా గం గం గణేశా మూవీలో ఉంటుంది. వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం. ఆద్యంతం సినిమా వినోదాత్మకంగా ఉంటూనే ట్విస్ట్ లు థ్రిల్ కలిగిస్తాయి. థియేటర్స్ లో గం గం గణేశాను చూస్తూ ఎంజాయ్ చేయండి. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు