Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం విప్లవాత్మక వివాహ సేవ 'తెలుగు సంగం'

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం విప్లవాత్మక వివాహ సేవ 'తెలుగు సంగం'

ఐవీఆర్

, బుధవారం, 15 మే 2024 (22:05 IST)
వైవాహిక ఆనందం కోసం ప్రత్యేక కమ్యూనిటీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేక వివాహ వేదిక 'తెలుగు సంగం',  మ్యాట్రిమోనీ విభాగాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఇది పూర్తిగా సిద్దమైనది. ఈ సరి కొత్త సేవ సభ్యులకు అధిక నాణ్యత, సురక్షితమైన మరియు విజయవంతమైన మ్యాట్రిమోనీ అనుభవాన్ని అందిస్తోంది. ఇది తెలుగు తల్లిదండ్రులు, అర్హత కలిగిన సింగిల్స్‌కు ఖచ్చితంగా నచ్చుతుంది. నమ్మదగిన సేవగా నిలుస్తుంది. ఈ సేవ యొక్క ముఖ్య ఫీచర్లులో 100% ధృవీకరించబడిన ప్రొఫైల్‌లు, ధృవీకరించబడిన ఫోటోగ్రాఫ్‌లతో ప్రొఫైల్‌లు మాత్రమే అందించటం, ప్రతి వారం హామీ ఇవ్వబడిన కొత్త ప్రొఫైల్‌లు, సభ్యత్వ వ్యవధిలో మానవ సహాయం, మద్దతు వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వ్యక్తుల ప్రత్యేక ప్రాధాన్యతలను తీర్చడానికి, వారి స్వంత సాంస్కృతిక సందర్భంలో సంబంధాలను పెంపొందించడానికి ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది.
 
ఆన్‌లైన్ మ్యాచ్‌మేకింగ్ యొక్క శక్తివంతమైన విభాగంలో, తెలుగు సంగం భారతదేశంలో మొట్టమొదటి, 100% ధృవీకరించబడిన, ప్రీమియం మ్యాట్రిమోనీ సేవగా ప్రతిజ్ఞ చేస్తుంది. వినియోగదారు గుర్తింపులను ప్రామాణీకరించడం ద్వారా, సందేహాస్పద ప్రొఫైల్‌లను నిరోధించడం, ఆన్‌లైన్ మ్యాచ్‌మేకింగ్‌ను సురక్షితంగా చేయడం దీని లక్ష్యం.
 
పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు&సీఈఓ అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ, “కమ్యూనిటీ-నిర్దిష్ట సంబంధాలను కోరుకునే వినియోగదారులకు అధిక నాణ్యత, సురక్షితమైన, అనుకూలీకరించిన అనుభవాన్ని అందించడానికి తెలుగు సంగం రూపొందించబడింది. తెలుగు మాట్లాడే కమ్యూనిటీతో లోతుగా ప్రతిధ్వనించేలా ఈ సేవ రూపొందించబడింది. జీవితకాలం కోసం అర్ధవంతమైన సంబంధాలను కనుగొనడంలో, నిజమైన, ఒకే తరహా ఆలోచనలు కలిగిన జీవిత భాగస్వాముల కలయికను నిర్ధారించడంలో వ్యక్తులకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుంది" అని అన్నారు. 
 
షాదీ.కామ్ గ్రూప్ నుండి వచ్చిన కొత్త సేవ తెలుగు సంగం. కఠినమైన గోప్యత, భద్రతా చర్యలను అందించడానికి ఇది కట్టుబడి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల కలయికతో సహా కఠినమైన ధృవీకరణ ప్రక్రియను ఉపయోగిస్తుంది. వినియోగదారులకు సురక్షితమైన, విశ్వసనీయమైన ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గత 9 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 300 శాతం పెరుగుదల: రైతు సంఘాల నివేదిక