Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైలీ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్‌ను ప్రారంభించిన మొబిక్విక్

gold coins

ఐవీఆర్

, మంగళవారం, 14 మే 2024 (22:20 IST)
భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన బంగారం సంప్రదాయకంగా అత్యంత ప్రాధాన్యమైన పొదుపు సాధనాల్లో ఒకటి. ఫిన్‌టెక్ కంపెనీ అయిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ (మొబిక్విక్) డైలీ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన డైలీ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ వినియోగదారులకు రోజువారీ చిన్న మొత్తాలను పొదుపు చేయడానికి, ఆర్థిక వివేకం సంస్కృతిని పెం పొందించడానికి, క్రమంగా సంపదను పోగుచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
 
తన వినియోగదారులు క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాట్లను రూపొందించుకోవడాన్ని మొబిక్విక్ ప్రోత్స హిస్తోంది. ఈ అలవాట్లు దీర్ఘకాలంలో ప్రతిఫలాలను అందజేస్తాయి. వినియోగదారులు రోజువారీ, నెలవారీ లేదా వన్ టైమ్ SIPలను ఎంచుకోవచ్చు. డైలీ SIP ప్లాన్ సాచెట్ సేవింగ్‌ను సులభతరం చేస్తుంది. డైలీ గోల్డ్ సేవిం గ్స్ ప్లాన్ యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి ఏమిటంటే, రూ. 51 కంటే ఎక్కువ రోజువారీ మొత్తం SIP చేసే వినియోగదారులు ప్రతి త్రైమాసికంలో ఒక SIP ఖర్చులను కవర్ కావడానికి అర్హులు, తద్వారా ఇది వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో వారికి సహాయపడుతుంది.
 
సురక్షిత, భద్రత అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడానికి, మొబిక్విక్ బంగారం కొనుగోళ్ల విశ్వసనీయత కోసం SAFEGoldతో భాగస్వామ్యం కలిగి ఉంది. అదనంగా, అదనపు ఛార్జీ లేకుండా డోర్‌స్టెప్ డెలివరీతో ప్లాన్ వినియోగదారులకు వారి బంగారం హోల్డింగ్‌లను ఎప్పుడైనా విక్రయించే లేదా బహుమతిగా ఇచ్చే సౌలభ్యాన్ని అందిస్తుంది.
 
ఇంతకుముందు భారతదేశంలోని ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లోని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా మాత్రమే ఇలాంటి పథకాలు అందుబాటులో ఉండేవి.  గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబిక్విక్ యాప్ ద్వారా నేరుగా మిలియన్ల మంది వినియోగదారుల చేతుల్లోకి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను తీసుకువస్తుంది.
 
ఈ సందర్భంగా మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, “బంగారాన్ని చాలాకాలంగా సురక్షితమైన పొదుపు మాధ్యమాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది కాల పరీక్షకు నిలుస్తుంది. మా డైలీ గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ ఈ సంప్రదాయాన్ని డిజిటలైజ్ చేయడం మరియు అందరికీ అందుబాటులోకి తేవడం, అందరికీ చేరువలో ఉండేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం క్రమశిక్షణతో కూడిన పొదుపు, సంచిత సంపద పోగుచేయడాన్ని ప్రోత్సహించడం, వారి ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం కోసం ఇది ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయ్‌లో అద్భుతమైన మ్యూజియంలు: శతాబ్దాల నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు