Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అన్నమయ్య" చిత్ర నిర్మాత ఇకలేరు...

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (08:56 IST)
హీరో అక్కినేని నాగార్జునతో అన్నమయ్య వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వి.దొరస్వామిరాజు ఇకలేరు. ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. వీఎంసీ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థపై ఆయన అనేక చిత్రాలు నిర్మించారు. 
 
గత కొంతకాలం నుంచి వయో భారంతో దొరస్వామిరాజు ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈయన నిర్మాణ సంస్థపై సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్ల్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు. 
 
వి.ఎం.సి(విజయ మల్లీశ్వరి కంబైన్స్‌) పేరు మీద సినీ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసును ప్రారంభించి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి సీడెడ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా ఈయన పేరు పొందారు. 1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు. 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments