Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (17:55 IST)
Myrna Menon
ప్రొడ్యూసర్ నాగవంశీ బావమరిది రుష్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘డాన్ బాస్కో’. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ కూడా ముగింపుదశకు చేరుకుంది. నేడు ఈ సినిమాలో నాయిక పాత్రను పరిచయం చేస్తూ ప్రకటించారు. శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. శైలేష్ రమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
జైలర్, నాసామి రంగ చిత్రాల ఫేమ్ మిర్నా మీనన్‌ను ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇందులో ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో నటిస్తుండగా.. లెక్చరర్ సుమతి పాత్రలో మిర్నా మీనన్ నటిస్తున్నారు. ఇంకా  మౌనిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు ఈ ఎంటర్‌టైనింగ్ రైడ్‌లో ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
 
‘డాన్ బాస్కో’ అనే టైటిల్‌ ఆసక్తికరంగా ఉంది. ‘వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్ - బ్యాచ్ 2014’...‘అన్ని రీయూనియన్‌లు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటానికే కాదు..కొన్ని విమోచన గురించి కూడా’  అని ఉంది. ఈ క్యాప్షన్ సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. శంకర్ గౌరి ఈ చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
నటీనటులు - రుష్య, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, విష్ణు ఓయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments