Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (17:44 IST)
Sumanth dubbing
రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
 
సోసియో ఫాంటసీ నేపథ్యంలో సూపర్ న్యాచురల్ కథతో వస్తోన్న మహేంద్ర గిరి వారాహి సినిమా కోసం ఒక విభిన్నమైన, సరికొత్త పాత్రను హీరో సుమంత్ కోసం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి డిజైన్ చేశారని నిర్మాత మధు కాలిపు అన్నారు.
 
సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు, ఈ సినిమాకు కథ మురళి.
 
తాజాగా సుమంత్ తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేశారు, తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని, సుమంత్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments