Webdunia - Bharat's app for daily news and videos

Install App

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

దేవీ
గురువారం, 19 జూన్ 2025 (16:25 IST)
Divyandu Sharma
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో  'పెద్ది' భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో మీర్జాపూర్‌’ సిరీస్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
 
ఈ చిత్రంలో 'రామ్‌ బుజ్జి' అనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు దివ్యేందు శర్మ. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించి దివ్యేందు శర్మ పోస్టర్ అదిరిపోయింది.
 
దివ్యేందు శర్మను 'రామ్‌ బుజ్జి'గా పరిచియం చేసిన పోస్టర్ కి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పెద్దిలో 'రామ్‌ బుజ్జి' క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుండబోతోంది.
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో  హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ మైండ్-బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా వుండబోతోంది.  
 
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
చిత్రానికి స్టార్ డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేశారు.
 
ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
తారాగణం: రామ్ చరణ్, జాన్వి కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Army: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి.. అమలులో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments