Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదురుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - విశ్వక్ సేన్ వివాదం.. వీళ్లిద్ద‌రికి ఏమైంది..?

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:39 IST)
ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన యువ న‌టుడు విశ్వ‌క్ సేన్. ఇటీవల హైదరాబాదీ నేటివిటీతో ఫలక్‌నుమా దాస్ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వం తెర‌కెక్కించారు. ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. అయితే.. తన సినిమా బాగాలేదన్నందుకు నోటికొచ్చిన‌ట్టు బూతులు మాట్లాడి ఓ వీడియో చేసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు విశ్వక్. 
 
ఈ సినిమా బాగాలేద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనితో వివాద‌స్ప‌ద‌మైంది. ఈ వివాదంపై మీడియా ముందుకు వచ్చిన విశ్వక్ వివరణ ఇచ్చాడు. 
 
ఇంత‌కీ ఏం మాట్లాడాడంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో చివరి 6 నిమిషాల వీడియో వివాదాస్పదం చేస్తున్నారు. కొందరు పనిగట్టుగొని నా సినిమాపై వివాదం సృష్టిస్తున్నారు. 
 
రెండేళ్లు కష్టపడి ఎంతో శ్రమించి తీసిన సినిమాను విమర్శిస్తున్నారు. డబ్బులెక్కువై నేను ఈ సినిమా తీయలేదు. నా సినిమాలో మా కుటుంబం, స్నేహితుల డబ్బు ఉంది. 10 కోట్ల నష్టం వాటిల్లుతుందనే అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడటం తప్పే, క్షమించండి.. నేను రివ్యూ రైటర్ల గురించి అసభ్యంగా మాట్లడటం లేదు. నా సినిమా పోస్ట‌ర్ల‌ను చించేసారు. అస‌లు పోస్టర్లు చించాల్సిన అవసరం ఏముంది..?. 
 
నేను ఎవరికి భయడటం లేదు. ఈ వీకెండ్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రం నాదే. నేను రివ్యూ రైటర్లను తిట్టినట్లు నిరూపిస్తే పరిశ్రమ నుంచి వెళ్లిపోతాను. నా సినిమాపై ఎందుకు అంత పగపడుతున్నారు. ప్రేక్షకులను తిట్టడానికి నాకు బుర్రలేదా..?. సినిమా హిట్ అయ్యిందని కళ్లు నెత్తికెక్కే టైపు కాదు. ప్రేక్షకులు నా సినిమాను బతికిస్తున్నారు. నేను ఏ రివ్యూ రైట‌ర్‌ను కానీ.. ఏ మీడియా వాళ్లను కానీ.. ఏ హీరోను కానీ విమ‌ర్శించ‌లేదు.. నా సినిమా ప్ర‌మోష‌న్స్‌తో నేను బిజీగా ఉన్నాను. 
 
కానీ కొందరు మాత్రం నా సినిమాను కావాలనే టార్గెట్ చేసి.. నష్టం చేయడానికి చూస్తున్నారు. వాళ్లను విమర్శించాను కానీ ఎవర్నీ పర్సనల్‌గా టార్గెట్ చేసి అన్న మాటలు కావు అని విశ్వక్ చెప్పుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారని విశ్వ‌క్ సేన్ చెప్ప‌లేదు కానీ.. వాళ్ల‌ని ఉద్దేశించే ఇలా మాట్లాడాడ‌ని అంటున్నారు. మ‌రి.. ముదురుతోన్న ఈ వివాదం గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందిస్తాడేమో చూడాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments