Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైత‌న్య‌, స‌మంత నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారా..? ఫ్యామిలీలో గొడ‌వ‌లా..?

Advertiesment
చైత‌న్య‌, స‌మంత నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారా..? ఫ్యామిలీలో గొడ‌వ‌లా..?
, మంగళవారం, 4 జూన్ 2019 (10:46 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత వీరిద్ద‌రు వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. చైత‌న్య వెంకీ మామ‌, స‌మంత ఓ బేబీ సినిమా చేస్తున్నారు. అయితే... ఇప్పుడు వీర‌ద్ద‌రు క‌లిసి ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. చైత‌న్యకి ఫ‌స్ట్ నుంచి నిర్మాణ రంగం పైన ఇంట్ర‌స్ట్ ఉంది. 
 
ఒక లైలా కోసం సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు చైత‌న్యే చూసుకున్నారు. తాజాగా మ‌న్మ‌థుడు 2 నిర్మాణంలో కూడా ఇన్‌వాల్వ్ అవుతున్నాడ‌ట‌. అయితే.. ఓవైపు అన్న‌పూర్ణ స్టూడియోస్, మ‌రోవైపు మ‌నం ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ‌లు ఉన్నాయి. అయినా కానీ... ఇప్పుడు మ‌రో సంస్థ‌ను స్టార్ట్ చేయ‌డం ఏంటి..? అంటూ ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.
 
ఫ్యామిలీలో గొడ‌వ‌లు ఉన్నాయా..? అందుకే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా..? అని ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే.. త‌మ‌కు న‌చ్చిన క‌థ‌ల‌తో బ‌య‌ట వాళ్ల‌తోనైనా స‌రే... సినిమాలు తీయాలి అనుకుంటున్నార‌ట‌. ఆల్రెడీ కొన్ని క‌థ‌లు ఓకే చేసార‌ట‌. మ‌రి... చైత‌న్య‌, స‌మంత స్టార్ట్ చేసే బ్యాన‌ర్‌లో ఫస్ట్ మూవీ ఎవ‌రితో ఉంటుందో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాంత్ అడ్డాల‌కు షాక్ ఇచ్చిన నాని... పాపం ఎప్పుడు కోలుకుంటాడో..?