Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్

దేవి
సోమవారం, 3 మార్చి 2025 (10:29 IST)
VV Vinayak latest
ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును అని  వి వి వినాయక్ టీమ్  కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.
 
వి.వి. వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కోలుకుంటున్న ఆయన, తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వచ్చాయి. చిరంజీవి 15౦ సినిమాకు ఆయన దర్శకత్వ్యం వహించారు. ఆతర్వాత గ్యాప్ తీసుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో ప్రభాస్ చేసిన చత్రపతి సినిమాను హిందీలో రిమేక్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 
 
కరోన తర్వాత ఆయన ఆరోగ్యం పై చాల శ్రద్ద పెట్టారు. నటుడిగా చేయడానికి తన బాడీ ని తగ్గించుకున్నారు. లావుగా ఉండే ఆయన గుర్తు పట్టకుండా మారారు. తను ప్రధాన పాత్రతో సినిమా చేయడానికి సిద్దం అయారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతుందని వార్తలు వచ్చాయి.  కాని ఎందుకనో నేను ఆ సినిమా చేయడం లేదని వినాయక్ ప్రకటించారు. ఆ తర్వాత దర్శకుడిగా వేనుకపదిపోయారు. ఆయనతో ఓ సినిమా చేయాలని బెల్లంకొండ సురేష్ కూడా తన పుట్టిన రోజు నాడు ప్రకటించారు. సో, వినాయక్ ఆరోగ్యం గా ఉన్నారని అతని టీం చెపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments