Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్ : ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తప్పుకున్న తేజ

టాలీవుడ్‌లో షాకింగ్ న్యూస్. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నట్టు సినీ దర్శకుడు తేజ ప్రకటించారు. నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (09:14 IST)
టాలీవుడ్‌లో షాకింగ్ న్యూస్. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నట్టు సినీ దర్శకుడు తేజ ప్రకటించారు. 
నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర‌ను నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ పోషిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సినిమా ప్రారంభోత్స‌వం సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.
 
అయితే, ఇంతలో ఏమైందో ఏమోగానీ, తేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్రకటించి ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ఇంత‌కీ తేజ మీడియాతో ఏం చెప్పారంటే... తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానినని, ఈ సినిమాకి న్యాయం చేయలేకపోతానని తనకు అనిపిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 
 
అదేసమయంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఉండొచ్చని కూడా తేజ చెప్పారు. మ‌రి... తేజ చెప్పిన‌ట్టుగానే రాఘవేంద్ర రావు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా..? ఇంకెవ‌రికైనా ఈ ఛాన్స్ ద‌క్కుతుందా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments