Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో తెలుగు దర్శకుడు కన్నుమూత, టాలీవుడ్ దిగ్భ్రాంతి

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:40 IST)
director sai balaji
సినిమా దర్శకుడు, రచయిత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్ ) కోవిడ్-19తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు.
 
తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖ లో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్‌కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు. కృష్ణ‌వంశీ, నాగ‌బాబు, వై.వి.ఎస్‌. చౌద‌రి ఆయ‌నను అభిమానించేవారు. వారు బాలాజీ మ‌ర‌ణం దిగ్బ్రాంతి క‌లిగింద‌ని సందేశంలో పేర్కొన్నారు.
 
మెగాస్టార్ హీరోగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ”బావగారు బాగున్నారా" చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు. తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్ కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments