ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయమై... చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు మారుతి. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా వరుసగా సక్సెస్‌ఫుల్ మూవీస్
ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయమై... చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు మారుతి. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా వరుసగా సక్సెస్‌ఫుల్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. మారుతి తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య నటించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మారుతి మీడియాతో మాట్లాడుతూ... కంచరపాలెం సినిమాని అందరూ కొత్తవాళ్లతో తీసారు. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ సినిమాని ప్రమోట్ చేసారు.. చేస్తున్నారు. కానీ... జనం చూడటం లేదు. వాళ్లకి తెలుసు.. ఏ సినిమాని చూడాలో. ఏ సినిమాని చూడకూడదో. ప్రమోట్ చేసినంత మాత్రాన చూడటానికి వాళ్లేమన్నా పిచ్చోళ్లా అన్నారు.
మారుతి ఈ రోజుల్లో సినిమాని కూడా కొత్తవాళ్లతోనే తీసాడు. కానీ.. ఇప్పుడు మరో డైరెక్టర్ కొత్తవాళ్లతో సినిమా తీస్తే.. అభినందించకుండా కొత్తవాళ్లతో సినిమా తీస్తే చూడడానికి జనం ఏమన్నా పిచ్చోళ్లా అంటూ మాట్లాడటం వెనకున్న మర్మం ఏమిటో..?