బెడ్రూంలో బాగా ఎంజాయ్ చేసి బయటకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ అంటే ఎలా? రష్మీ సంచలన వ్యాఖ్యలు

యాంకర్, నటి రష్మీ గౌతమ్ అంటే బోల్డ్‌గా మాట్లాడేస్తుందని పేరు. ఏదీ దాచిపెట్టుకోదు. ఉన్నది వున్నట్లు కుండబద్ధలు కొట్టేస్తుంది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్యాస్టింగ

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (18:06 IST)
యాంకర్, నటి రష్మీ గౌతమ్ అంటే బోల్డ్‌గా మాట్లాడేస్తుందని పేరు. ఏదీ దాచిపెట్టుకోదు. ఉన్నది వున్నట్లు కుండబద్ధలు కొట్టేస్తుంది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురవగా కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చింది. 
 
అవకాశం ఇస్తానంటే వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి అవకాశానికి తను క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టననీ, దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. కెరీర్ బాగుంటుందనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది. అవకాశం కోసం ఒకరు, అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు పరస్పరం అంగీకారంతో జరిగేదానికి క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం ఏంటంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. గట్టిగా చెప్పాలంటే... అవకాశం ఇస్తానంటే వెళ్లి బెడ్రూంలో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్ అంటూ గొడవ చేయడం ఏంటని అడిగేసింది.
 
తన మటుకు తనకు ఇప్పటివరకూ అలాంటి అనుభవం కలుగలేదనీ, తన పారితోషికం విషయంలోనే కొన్నిసార్లు సమస్యలు వచ్చాయని స్పష్టీకరించింది. మొత్తమ్మీద క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆందోళన చేస్తున్న శ్రీరెడ్డికి ఇలా చురకలు వేసినట్లు అనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అనసూయను చూసి నేర్చుకో... రష్మీ గౌతమ్ కెరీర్ అంతేనా?