Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదు : ఆండ్రియా

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పలువురు బాధిత హీరోయిన్లు మాత్రమేకాకుండా కుర్రకారు నటీమణులు కూడా తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు. తాజాగా గాయని, నటి ఆండ్రియ

Advertiesment
నాకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదు : ఆండ్రియా
, బుధవారం, 29 ఆగస్టు 2018 (14:37 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పలువురు బాధిత హీరోయిన్లు మాత్రమేకాకుండా కుర్రకారు నటీమణులు కూడా తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు. తాజాగా గాయని, నటి ఆండ్రియా స్పందించింది.
 
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎంతో ధైర్యంగా ముందుకుసాగాలన్నారు. శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది.
 
ఇకపోతే, తనకు మాత్రం అలాంటి అనుభవాలు మాత్రం ఎదురు కాలేదన్నారు. అయితే, ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని ఖచ్చితంగా బయటపెట్టాలని కోరింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపింది. 
 
మహిళల బలహీనతలను అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడటం సరికాదు ఆమె హితవు పలికింది. కాగా, విశ్వనటుడు కమల్ హాసన్ తాజా చిత్రం విశ్వరూపం 2 చిత్రంలో ఆండ్రియా నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లో ఓ రెబెల్ హరికృష్ణ... అందుకే చంద్రబాబు పక్కనపెట్టేశారట...