Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ జనరేషన్‌ కోసం 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో కొత్త బ్యానర్ : దిల్ రాజు (Video)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (18:28 IST)
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మరో కొత్త సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీనికి "దిల్ రాజు డ్రీమ్స్" అని నామకరణం చేశారు. ఈ వివరాలను సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. జనవరి 10వ తేదీన "గేమ్ ఛేంజర్", సంక్రాంతి‌కి వెంకటేష్ అనీల్ రావిపూడి‌ల "సంక్రాంతికి వస్తున్నాం", శివరాత్రికి నితిన్ 'తమ్ముడు', నితిన్ - వేణు‌లతో యల్లమ్మ, యష్ మాస్టర్ హీరోగా సినిమా, ఆశిష్ సెల్ఫీష్ సినిమా, ఇలా అనేక సినిమాలతో బిజీగా ఉన్నట్టు చెప్పారు. 
 
అయితే, "జటాయి" అనే పాన్ ఇండియా సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. యంగ్ జనరేషన్‌తో సినిమాలు చేయాలని ఉందన్నారు. ఎందుకో తాను కొంత ఈ జనరేషన్‌కు డిస్కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుందన్నారు. గతంతో తన జర్నీలో అన్నీ అధ్బుతమైన సినిమాలు తీశామని గుర్తు చేశారు. అందరి స్టార్ హీరోలతో చేశామని, చిత్రపరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిందని తెలిపారు. 
 
ఇప్పుడు మా వద్ద అనేక కంటెంట్స్ సిద్దం చేశామని, వరుస సినిమాలు చేస్తున్నామని, అందువల్ల గ్యాప్ రాకూడదని భావిస్తున్నట్టు చెప్పారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని కొత్త బ్యానర్ "దిల్ రాజు డ్రీమ్స్" పేరుతో నామకరణం చేసినట్టు చెప్పారు. యంగ్ జనరేషన్‌కు ఇదోక మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పారు. 
 
360 డిగ్రీస్‌లో అందుబాటులో ఉండాలనే థాట్‌తో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు లోగో‌ను లాంఛ్ చేస్తున్నామని, దిల్ రాజు డ్రీమ్స్‌కు అనేక టీమ్స్‌ను ఫామ్ చేశామని, కథలు, సినిమాల నిర్మాణం, విడుదల వరకు.. న్యూటాలెంట్‌కు సపోర్ట్ చేయాలనేదె మా ఆలోచనగా ఉందన్నారు. వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని,  త్వరలోనే దాన్ని లాంచింగ్ ఉంటుందని తెలిపారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments