Publish Date: Fri, 08 Nov 2024 (14:07 IST)
Updated Date: Fri, 08 Nov 2024 (14:15 IST)
ఎస్.శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "గేమ్ ఛేంజర్". జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 9వ తేదీన లక్నోలో విడుదల చేయనున్నారు. ఇదేసమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ టీజర్‌ను 11 సెంటర్స్‌లో ఈ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలోని సుదర్శన్, వైజాగ్ సంగం శరత్, రాజమండ్రి శివ జ్యోతి, విజయవాడ శైలజ, కర్నూల్ వి మెగా, నెల్లూర్ ఎస్2 థియేటర్, బెంగళూర్ ఊర్వశి థియేటర్, అనంతపూర్ త్రివేణి, తిరుపతి పీజీఆర్, ఖమ్మం ఎస్‌వీసీ థియేటర్లలో టీజర్‌ను అభిమానుల సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి "జరగండి... జరగండి" పాటతో పాటు 'రా మచ్చా రా... సాంగ్' అనే మరో పాటను విడుదల చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికల నిర్వహణను పరీక్షించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
అవినీతి రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని కాపాడటానికి ఎన్నికల నిర్వహణను నిజాయతీగా ఎలా నిర్వహించాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు.