Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర రిలీజ్.. సుదర్శన్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం.. కటౌట్ దగ్ధం (video)

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (14:05 IST)
NTR
దేవర విడుదల వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సమీపంలోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన భారీ వేడుకల్లో ఉత్సాహంగా ఉన్న అభిమానులు కాల్చిన బాణాసంచా కారణంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ మంటల్లో చిక్కుకుంది. దేవర: పార్ట్ 1 వేడుకలను పురస్కరించుకుని వందలాది మంది అభిమానులు గుమిగూడిన సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది.
 
మంటల్లో ఎన్టీఆర్‌ కటౌట్ పూర్తిగా దగ్దం అయింది. మంటలు ప్రారంభం అయిన నిమిషాల్లోనే ఎన్టీఆర్‌ కటౌట్‌ మొత్తం మసి అయిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కావాలని ఎన్టీఆర్‌ కటౌట్‌కి నిప్పు అంటించారని కొందరు ఆరోపిస్తున్నారు. 
 
కొందరు మాత్రం అభిమానులు క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో నిప్పు రవ్వలు కటౌట్ మీద పడి మంటలు రాజుకున్నాయి అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ కటౌట్‌ కాలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments