Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

Advertiesment
devara movie

ఠాగూర్

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (17:08 IST)
సినీ అభిమాలు జేబులను మూవీ టిక్కెట్ మాఫియా లూఠీ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాబినేషన్‌లో ఈ నెల 27 తేదీ శుక్రవారం "దేవర" చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రం బెనిఫిట్ షో, ఫ్యాన్స్ షో పేరుతో మిడ్ నైట్ షో అర్థరాత్రి ఒంటి గంటకు ప్రదర్శించనున్నారు. ఈ షో కోసం సాధారణ టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
కానీ మూవీ టిక్కెట్స్ మాఫియా మాత్రం ఒక్కో టిక్కెట్‌ రేటును అమాంతం పెంచేసింది. కనీసం రెండు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనికి థియేటర్ యాజమాన్యాలు కూడా తమవంతు సహకారం అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 20కి పైగా థియేటర్స్‌లోలో అర్థ రాత్రిన బెనిఫిట్ షోలను ప్రదర్శించనున్నారు. 
 
ఆన్‌లైన్‌లో బుకింగ్స్ పెట్టకుండానే నేరుగా టికెట్లను అమ్మేశారు. దీని వెనుక చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులతోపాటు ఓ ఛానెల్ ఎంటర్‌టైన్మెంట్ హెడ్.. మరికొందరు సినిమా పిఆర్వోల గ్రూపు ఉంది. క్రేజీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో ఫ్యాన్స్ క్రేజ్‌ను ఈ మూవీ టిక్కెట్ మాఫియాలు క్యాష్ చేసుకుంటున్నాయి. 
 
తమకు సినిమా ప్రమోషన్స్ ఇవ్వకుంటే సదరు సినిమాలకు నెగిటివ్ ప్రమోషన్స్ చెస్తున్నారు. ఇండస్ట్రీ‌లో సినిమా మీద బ్రతుకుతూ. సినిమాపైనే దుష్ప్రచారం చేస్తున్న కంత్రీ గాళ్లు ఎక్కువైపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అల్టిమేట్ సినిమా ఫలితంపైనే ఎఫెక్ట్ పడుతుంది. ఇండస్ట్రీలో జరుగుతోన్న సినిమా చుట్టూ నడుస్తున్న చీకటి వ్యవహారాలపై అన్నీ తెలిసినా అగ్ర నిర్మాతలు మాత్రం ఏమి జరగనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తీరా సినిమాపై విష ప్రచారం జరిగాక నిర్మాతలు లబోదిబోమంటున్నారు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది