Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

Advertiesment
Devara preview poster

ఠాగూర్

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (07:21 IST)
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా, ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం కావడంతో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. 
 
పైగా, ఈ చిత్రం అంచనాలకు తగిన విధంగానే చిత్రం ప్రారంభ వసూళ్లు కూడా ఉన్నాయి. ఓవర్‌సీస్‌‍తో పాటు ఏపీ, తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగానే వచ్చాయి. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందస్తు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతులు జారీ చేశాయి. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ఎలా వుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం..
 
దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్న సినిమా నేపథ్యం ఆడియన్స్ చాలా కొత్తగా, ఫ్రెష్ ఫీల్‌ను కలిగించేలావుంది. కథ, కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. సినిమా తొలి భాగం వేగంగా నడిచే కథనంతో, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా వుంది. ఇకపోతే, రెండో భాగం మాత్రం కాస్త నెమ్మదించినా ఆయుధ ఏపిసోడ్, పతాక సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి, ముఖ్యంగా దేవ, వర ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
 
కొరటాల తన రచన పదును మరోసారి "దేవర" చిత్రంతో చూపించాడు. జాన్వీ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. పాటలన్నీ కథలో భాగంగా వున్నాయి. పిక్చరైజేషన్ బాగుంది. అనిరుధ్ బీజీఎమ్ స్టోరీని ముందుకు నడిపించడంతో పాటు స్టోరీ మూడ్ తగిన విధంగా వుంది. విజువల్స్, పిక్చరైజేషన్స్ ఊహించినస్థాయి కంటే బాగున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా మాస్ ఫీస్ట్ అనిపిస్తే సగటు ప్రేక్షకుడికి మాత్రం వన్‌టైమ్ వాచ్ మూవీలా అనిపిస్తుంది. ఫైనల్గా 'దేవర'ను అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ