Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్ గల్లా చిత్రంలో ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే వైలెంట్ ఫస్ట్ లుక్

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (18:44 IST)
Devadatta Nage
'హీరో' చిత్రంతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ సినిమా 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #AshokGalla2 చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కంసరాజు అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు దేవదత్త. ఫస్ట్ లుక్ లో కత్తి పట్టుకుని చాలా వైలెంట్ గా కనిపించారు.

ఈ చిత్రంలో అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.  ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస,  దేవదత్త నాగే
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments