Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్య భామగా మిస్ ఇండియా మానస వారణాసి పరిచయం

Advertiesment
Manasa Varanasi
, గురువారం, 31 ఆగస్టు 2023 (13:03 IST)
Manasa Varanasi
'హీరో' చిత్రంతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ సినిమా 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #AshokGalla2 చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రంలో అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను సత్య భామగా పరిచయం చేశారు. ట్రెడిషినల్ గెటప్‌లో హాఫ్ శారీలో ఆమె అందంగా కనిపిస్తుంది. ప్లజెంట్ స్మైల్ ఆమె పాత్రకు మరింత ఎలిగెన్స్ ని జోడిస్తుంది.
 
అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా అతని పాత్రను పరిచయం చేస్తూ గతంలో మేకర్స్ ఒక  గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ అశోక్ గల్లాని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ఈ చిత్రంలో అశోక్ గల్లా రగ్గడ్, మాస్ లుక్‌లో కనిపిస్తారు.
 
ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఇటివలే ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వలో తెలియజేస్తారు.  
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో అలరిస్తున్న యూత్ మూవీ మ్యాడ్ టీజర్