Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తి జపాన్ తెలుగు హక్కులని సొంతం చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (18:30 IST)
karti-japan
హీరో కార్తి 25వ చిత్రం 'జపాన్‌'. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. 'జపాన్‌' దీపావళికి విడుదలవుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కి దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాజెక్ట్ లోకి రావడంతో సినిమా గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది  

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్ హామీ ఇచ్చింది. జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్, కథాంశంగా కనిపిస్తోంది. ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్‌ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు.

కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ రవి వర్మన్ టీజర్ లో  క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌లు బ్రిలియంట్ గా ఉండగా, జివి ప్రకాష్ కుమార్ తన బిజిఎమ్‌తో వాటిని మరింత ఎలివేట్ చేశారు.ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ ప్రముఖులే సాఫ్ట్‌కార్నర్‌గా మారుతున్నారు : తెలుగు ఫిల్మ్ చాంబర్

జనసేన సనాతన ధర్మం డిక్లరేషన్: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం

రైల్వే ఉద్యోగులకు ముందుగానే దీపావళి : 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

ప్రీ-వెడ్డింగ్ షూట్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన జంట.. నెట్టింట విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments