Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సరసన దీపికా నటించాల్సిందే.. పట్టుబడుతున్న నాగ్ అశ్విన్?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:42 IST)
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. కరోనా ప్రభావంతో షూటింగ్స్ అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన గత చిత్రం ''మహానటి''ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. 
 
ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్‌గా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని సమాచారం.
 
అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటీనటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. 
 
ఇప్పటికే దీపికా, ఆలియా భట్‌లను సంప్రదించారు. కానీ దీపికా మాత్రం ఈ సినిమాకు అడిగిన రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గినా నాగ్ మాత్రం ఆమెనే ఫైనల్ చేయాలని డిసైడైనట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments