Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు : రకుల్ వద్ద పూర్తయింది.. ఇక దీపికా వంతు...

Deepika Padukone
Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (08:58 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో విచారణను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వేగవంతం చేసింది. ఇందులోభాగంగా, ఈ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేరు వెలుగులోకి వచ్చాయి. వారందరికీ సమన్లు జారీ చేసి, ఒక్కొక్కరిగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్ద ఎన్.సి.బి విచారణ పూర్తి చేశారు. 
 
ఈ విచారణ దాదాపు నాలుగు గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆమె నుంచి పలు కీలక విషయాలను అధికారులు రాబట్టారు. ఆమె స్టేట్మెంట్‌ను రికార్డు చేశామని పేర్కొన్న ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్, ఆ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత కోర్టుకు నివేదిస్తామని తెలిపారు.
 
కాగా, నేడు మరో హీరోయిన్ దీపికా పదుకొనేను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ను శుక్రవారం విచారించామని, ఆపై డ్రగ్స్ వ్యవహారంలో దీపిక ప్రమేయం ఉందన్న సమాచారం లభించిందని కూడా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. 
 
నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ తమ విచారణలో కీలకమన్నారు. కాగా, శుక్రవారం నాడు అసిస్టెంట్ డైరెక్టర్లు క్షితి రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను కూడా విచారించారు. ఆపై క్షితి ఇంటిలో సోదాలు కూడా నిర్వహించారు. క్షితి పేరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న వారిని విచారించగా, తెలిసిందని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments