Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోయిన్లను ఇరికించిన రియా చక్రవర్తి : నటీమణులకు ఎన్.సి.బి పిలుపు!

హీరోయిన్లను ఇరికించిన రియా చక్రవర్తి : నటీమణులకు ఎన్.సి.బి పిలుపు!
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:09 IST)
ముంబై డ్రగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో పలువురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో వీరందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీచేశారు. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. ఈ పిలుపు అందినవారిలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరందరికీ ఎన్.సి.బి బుధవారం సమన్లు పంపించింది. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు వ్యవహారం పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు బాలీవుడ్ వెండితెరవెనుక చీకటి సామ్రాజ్యంగా విస్తరించుకున్న డ్రగ్స్ రాకెట్ మరకల మెరుపులను వెలుగులోకి తెచ్చింది. ఇది బాలీవుడ్‌ను కుదిపేస్తోంది.
webdunia
 
'పద్మావతి' ఇతర సినిమాలతో ఇప్పుడు బాలీవుడ్‌లో నెంబర్ 1గా రాణిస్తోన్న దీపిక, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, ఇతర భాషా సినిమాల్లో తళుకుబెళుకుల హీరోయినగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, అనతికాలంలోనే పాపులారిటీ రేంజ్ సాధించుకున్న సారా, శ్రద్ధాలకు బుధవారం వెలువరించిన సమన్లలో వారు తమ ముందుకు రావాల్సిన తేదీలను ఖరారు చేశారు. 
 
దీని మేరకు దీపిక పదుకొనే ఈ నెల 25వ తేదీన, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లు ఈ నెల 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఎన్‌సిబి ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కేవలం 24 గంటల వ్యవధిలోనే అంటే గురువారం తమ ముందు విచారణకు రావాలని తెలిపారు.
webdunia
 
అంతకుముందు బుధవారం సంస్థ అధికారులు సినిమా నిర్మాత మధు మంతెన నుంచి ఈ కేసుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు సేకరించి, స్టేట్మెంట్ తీసుకున్నట్లు వెల్లడైంది. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తడంతో సాగిన దర్యాప్తు క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా ప్రముఖ నటి రియా చక్రవర్తిని ఎన్‌సిబి విచారించి, తర్వాతి క్రమంలో అరెస్టు చేసింది.
webdunia
 
ఆమె నుంచి ఇతరత్రా కొందరు నటుల నుంచి తెలిసిన వివరాల ఆధారంగానే ఇప్పుడు ఈ నటీమణులకు సమన్లు వెలువరించినట్లు వెల్లడైంది. సమన్లు వెలువడిన వారిలో దీపిక ప్రస్తుతం గోవాలో షూటింగ్‌లో ఉన్నారు. ఇతర హీరోయిన్లు కూడా బిజీగా ఉన్నట్లు తెలిసింది. రకుల్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. వీరంతా కూడా తమ లాయర్లను సంప్రదిస్తున్నట్లు, ప్రస్తుత సమన్లను ఏ విధంగా ఎదుర్కొవాలనేది ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాయల్ ఆరోపణలతో ఒరిగేదేమీ లేదు.. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. కస్తూరి