Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

దేవీ
శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:13 IST)
Sai Rajesh Mahadev, Sumaya Reddy, Rajiv Kanakala
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాను సాయి రాజేష్ మహదేవ్ తెరకెక్కించాడు. రధన్ సంగీత దర్శకుడిగా, రాజ్ తోట కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ప్రేక్షకులు డియర్ ఉమ చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది.
 
సుమయ రెడ్డి మాట్లాడుతూ,  ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు ఎంతో ఆనందమేస్తుది. ఎన్నో సినిమాలు ఇంకా బయటకు రావడం లేదు. కానీ మేం మాత్రం సక్సెస్ ఫుల్‌గా సినిమాను రిలీజ్ చేశాం. అదే నాకు పెద్ద సక్సెస్. మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. మా అమ్మ, తమ్ముడు, మా టీం సహకారం వల్లే ఈ స్థాయి వరకు వచ్చాను. రధన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది. హాస్పిటల్‌లోనే మన జీవితం ప్రారంభం అవుతుంది.. అక్కడే మన జీవితం ముగుస్తుంది. ఇలాంటి ఓ మంచి సబ్జెక్ట్‌ మీద తీసిన మా డియర్ ఉమ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ మాట్లాడుతూ* .. ‘ప్రస్తుతం జనాలు థియేటర్లకు రావడం లేదు. కానీ మీడియా, మౌత్ టాక్ వల్లే థియేటర్లకు ఆడియెన్స్ వస్తున్నారు. మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా మంచి సినిమాను ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తూనే ఉంటారు. మా చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీడియాని, ఆడియెన్స్‌ని కోరుతున్నాను. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘సుమయ రెడ్డి ఎంతో కష్టపడి డియర్ ఉమ సినిమాని చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజ్ తోట కెమెరా వర్క్ బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు. రధన్ గారి మ్యూజిక్‌కు ప్రశంసలు వస్తున్నాయి. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments