Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

Advertiesment
Shiva Nirvana releases Sumaya Reddy.. Dear Uma teaser

దేవీ

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (15:53 IST)
Shiva Nirvana releases Sumaya Reddy.. Dear Uma teaser
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన ‘డియర్ ఉమ’ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి  లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. 
 
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డియర్ ఉమ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇప్పటికే అంచనాల్ని పెంచేశాయి. తాజాగా డియర్ ఉమ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన శివ నిర్వాణ చిత్రయూనిట్‌ను అభినందించారు. టీజర్ ఎంతో బాగుందని, ప్రేమతో పాటుగా అంతర్లీనంగా మంచి సందేశాన్నిచ్చే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లా ఉండబోతోందని అన్నారు.
 
‘గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనేలా ఎక్కువ’ అంటూ ప్రారంభమైన టీజర్‌లో, ‘రెండు జీవితాలు.. రెండు ప్రపంచాలు.. రెండు భావోద్వేగాలు.. ఇద్దరి ప్రేమలు..  ఒక హృదయం.. ఒక యుద్దం’, ‘పేషెంట్స్‌కి, డాక్టర్లకు మధ్య మీలాంటి కమిషన్స్ ఏజెన్సీ, బ్రోకర్లు ఉండకూడదు సర్.. దీని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను’ అనే డైలాగ్స్ ఎంతో ఎమోషనల్‌గా అనిపించాయి. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమతో పాటుగా ఇందులో సమాజాన్ని మేల్కొలిపే చక్కటి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా అర్థం అవుతోంది.
 
హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 
ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు