హీరో విజయ్‌ అభిమానుల్ని అలా కాపాడారు.. నెటిజన్ల ప్రశంసలు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:07 IST)
అటు తమిళంలోనూ అప్పుడప్పుడూ వచ్చే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న స్టార్ హీరో విజయ్. ముఖ్యంగా తమిళనాట ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ను చూసేందుకు, ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు బారులు తీరుతూంటారు. కాగా... ఆయనకు తాజాగా ఒక వింత అనుభవం ఎదురైంది. 
 
వివరాలలోకి వెళ్తే... ప్రస్తుతం తన 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్‌ చెన్నై శివార్లలో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీ పరిసర ప్రాంతాలలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడ ఆయన్ను చూసేందుకు వచ్చిన అభిమానులు సెట్‌ దగ్గర ఉన్న ఫెన్సింగ్ వద్ద గుమిగూడడం జరిగింది. బృందంతో కలిసి అటుగా వెళ్లిన విజయ్‌.. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ నడుస్తూండగా... ఈ క్రమంలో చిన్నపాటి తొక్కిసలాట ఘటన జరిగి కంచె ముందుకు పడిపోబోయింది. దీంతో విజయ్‌ వెంటనే కంచె పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నించారు. 
 
ఆయనతోపాటు బాడీగార్డులు, మిగిలిన వారంతా కంచె కింద పడకుండా ఆపగలిగారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంచె కింద పడి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, విజయ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి, అభిమానుల్ని కాపాడారని నెటిజన్లు మెచ్చుకుంటుంటే... మరి కొందరు విజయ్‌ నిజమైన హీరో అని అంటున్నారు. మొత్తం మీద స్టార్ హీరో అప్పుడప్పడూ రియల్ హీరో కూడా అవుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments