అందరి కళ్లు నా మీదే వుంటాయి... అందుకే..?: రకుల్ ప్రీత్ సింగ్

ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిగా గ్లామర్ తార రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశం తనకు దక్కడంపై రకుల్ తాజాగా హర్షం వ్యక్తం చేసింది.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (16:28 IST)
ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిగా గ్లామర్ తార రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశం తనకు దక్కడంపై రకుల్ తాజాగా హర్షం వ్యక్తం చేసింది. అంతేగాకుండా కోట్లాది మంది భారతీయ అభిమానుల్ని సొంతం చేసుకున్న లెజెండ్ శ్రీదేవికి తానూ ఓ అభిమానిని అని రకుల్ చెప్పుకొచ్చింది.


అలాంటి తాను ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో కనిపించనుండటం చెప్పలేనంత ఆనందంగా వుందని రకుల్ వెల్లడించింది. చాలా ఛాలెంజ్‌తో కూడిన ఆ పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకం వుందని రకుల్ తెలిపింది. 
 
ఇకపోతే.. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో మొదటి భాగానికి కథా నాయకుడు, రెండో భాగానికి మహా నాయకుడు అనే పేరు ఖరారు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషిస్తోంది. 
 
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ తానెప్పుడూ శ్రీదేవిని కలవలేదని.. అందుకే ఆమె సినిమాలను చూస్తున్నానని తెలిపింది. ఓ గొప్ప నటి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా వున్నా.. అందరి కళ్లు తన మీదే వుంటాయని చాలా జాగ్రత్తలు తీసుకుంటానని రకుల్ తెలిపింది. వంద శాతం శ్రీదేవి పాత్రకు న్యాయం చేయగలననే నమ్ముతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments