నాలో భాగమైన చైకి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. గర్వంగా వుంది.. సమంత

టాలీవుడ్ యువ దంపతులు నాగచైతన్య, సమంత అక్కినేని వివాహం జరిగి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత అక్కినేని ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (16:14 IST)
టాలీవుడ్ యువ దంపతులు నాగచైతన్య, సమంత అక్కినేని వివాహం జరిగి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత అక్కినేని ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది. తనలో భాగమైన చైకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. తనను చూస్తే గర్వంగా వుందంటూ ట్వీట్ చేసింది. ఈ గొప్ప రోజును తానెప్పుడూ మరిచిపోలేదని.. సమంత ట్వీట్ చేసింది.


అంతేగాకుండా తన పెళ్లి రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థ్యాంక్ చెప్పింది. నిత్యం తమపై ప్రేమానురాగాలు చూపిస్తున్న వారికి కృతజ్ఞులుగా ఉంటామని సమంత వివరించింది.  
 
గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీ సమంత-చైతూ ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలను ఒప్పించి రెండు సంప్రదాయాలకు గౌరవం తెచ్చేలా వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది వారికి తొలి యానివర్సరీ కావడంతో అక్కినేని కపుల్స్ మొన్నటివరకు హాలిడేస్‌లో ఉన్నారు.

సినిమాకు సంబందించిన పనులను వారం ముందే ఫినిష్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లారు. ఇటీవలే తిరిగొచ్చారు. వచ్చీరాగానే పెళ్లి రోజుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సమంత కృతజ్ఞతలు తెలిపింది. 
 
ఇకపోతే.. కెరీర్ పరంగా సమంత, నాగచైతన్య కలిసి పెళ్లికి తర్వాత ఓ చిత్రంలో కలిసి నటించనున్నారు. నిన్ను కోరి చిత్రం దర్శకుడు శివ నిర్వాణ ఆ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తారు. ఇంకా పేరుపెట్టని చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

సర్పంచ్ పదవికి వేలం పాట... ధర రూ.73 లక్షలు.. పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థులు..

Schools: అన్నమయ్య జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments