Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను''పై ఆ పార్టీ నేత ఫిర్యాదు.. ఇంతకీ ఎవరతను?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ''భరత్ అనే నేను'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నవోదయం పార్టీ నేత ఫిర్యాదు చేశారు. భరత్ అనే నేనులో నవోదయం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (09:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ''భరత్ అనే నేను'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నవోదయం పార్టీ నేత ఫిర్యాదు చేశారు. భరత్ అనే నేనులో నవోదయం పార్టీపై దుష్ప్రచారం చేశారని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఫిర్యాదు చేశారు. భరత్ అనే నేను సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో నవోదయం పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా చూపించారని నల్లకరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీ పేరును వాడుకోవడమే కాకుండా పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని దుర్వినియోగం చేశారన్నారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీని కలిసిన నల్లకరాజు సినిమాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించామని నల్లకరాజు గుర్తు చేశారు. కాగా  భరత్ అనే నేను సినిమా దాదాపు 200 కోట్లు గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments