మహేష్ బాబు 25వ సినిమాలో మహేష్, అల్లరి నరేష్ పాత్రలు ఇవే
భరత్ అనే నేను సినిమాతో సంచలన విజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న
భరత్ అనే నేను సినిమాతో సంచలన విజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూలును డెహ్రాడూన్‌లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాలో అల్లరి నరేష్.. మహేశ్ బాబు స్నేహితుడిగా కనిపిస్తాడట. కోటీశ్వరుడిగా మహేష్ బాబు కనిపిస్తే, పేదవాడైన ఆయన ప్రాణ స్నేహితుడుగా అల్లరి నరేష్ పాత్ర వుంటుందట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్‌ను ఫైనలైజ్ చేశారట. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. కెరీర్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ సినిమాతో మహేష్ మరో సంచలన విజయం సాధిస్తాడని ఆశిద్దాం.